గద్ద - వడ్డాణం

ఒక మహిళ మస్జిద్‌ ఆవరణలో పాకలో ఉంటూ ఒకరింట్లో పని చేసేది. ఆ యజమాని కూతురి పెళ్లిలో తోలువడ్డాణం పోయింది.

Updated : 19 Jan 2023 04:09 IST

క మహిళ మస్జిద్‌ ఆవరణలో పాకలో ఉంటూ ఒకరింట్లో పని చేసేది. ఆ యజమాని కూతురి పెళ్లిలో తోలువడ్డాణం పోయింది. దాన్ని మాంసం ముద్ద అనుకుని గద్ద ఎత్తుకెళ్లింది. అది తెలియక ఆమెపై నిందమోపి హింసించారు. అంతలోనే చెట్టు మీదున్న గద్ద వడ్డాణాన్ని కిందికి వదిలేసింది. వాళ్లు పశ్చాత్తాపం చెంది ఆమెని క్షమించమని అడిగారు. బానిసత్వం నుంచి విముక్తి కల్పించారు. ప్రవక్త తన భార్య హజ్రత్‌ ఆయిషా (రజి)కి వినిపించిన ఈ గాథ ప్రవక్త ప్రబోధల గ్రంథంలో ఉంది. ఆధారం లేకుండా నింద మోప కూడదన్నది దీని సారాంశం. అందుకే ఖురాన్‌ ‘అనుమానించడమూ పాపమే’ అంటూ హెచ్చరించింది.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని