ఇసుక తిన్నెలపై ఖలీఫా హజ్రత్‌

ఒకసారి రోమ్‌ నగర రాజు తన రాయబారిని రెండో ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) వద్దకు పంపాడు. మదీనా చేరుకున్న రాయబారి ‘మీ రాజు ఎక్కడ??’ అంటూ అడిగాడు.

Published : 04 May 2023 00:10 IST

కసారి రోమ్‌ నగర రాజు తన రాయబారిని రెండో ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) వద్దకు పంపాడు. మదీనా చేరుకున్న రాయబారి ‘మీ రాజు ఎక్కడ??’ అంటూ అడిగాడు. ‘మాకు రాజంటూ ఎవరూ లేరు, ప్రతినిధి, ఖలీఫా ఉన్నారు. కానీ ఆయన ఏదో పని మీద పట్నం వెళ్లారు’ అని బదులిచ్చారు ప్రజలు. ఆ రాయబారి హజ్రత్‌ ఉమర్‌ను వెతుక్కుంటూ వెళ్లి, ఆయన్ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ‘ముస్లింల ప్రతినిధి (అప్పటి సగం ప్రపంచానికి నాయకుడు) పట్టుపరుపు కానీ తివాచీ కానీ లేకుండా ఇసుక తిన్నెల మీద తల పెట్టు కుని విశ్రాంతి తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నాడు. ఎందరో రాజులను, వారి భోగభాగ్యా లను ప్రత్యక్షంగా చూసిన ఆ రాయబారి ఖలీఫా ఉమర్‌ (ర) నిరాడంబరతను చూసి అలా ప్రతిస్పందించాడు. ‘ఎవరి పేరు చెబితేనే ప్రపంచం భక్తితో మోకరిల్లుతుందో ఆ మహనీయుడు ఇతనేనా? ఓ ఉమర్‌! ఇంత నిరాడంబరంగా, మహోన్నతంగా ఉన్నారు కనుకనే ఇసుక మీద కూడా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు’ అనుకున్నాడు.

 ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు