శిష్యుల కాళ్లు కడిగిన ప్రభువు

లోకానికేం కావాలో ఏసు ప్రబోధించేవాడు. అయితే, తానేం ఉపదేశించాడో అవన్నీ స్వయంగా ఆచరించి చూపేవాడు. ‘మీరంతా పరస్పరం ప్రేమగా ఉండండి, వినయంగా నడుచుకోండి’ అంటూ ప్రజలకూ, శిష్యులకూ ఎన్నిసార్లు చెప్పినా, ఆ మాట ఆచరణకు దూరంగా, అర్థం కాని విషయంగా మిగిలిపోయింది.

Published : 04 May 2023 00:10 IST

లోకానికేం కావాలో ఏసు ప్రబోధించేవాడు. అయితే, తానేం ఉపదేశించాడో అవన్నీ స్వయంగా ఆచరించి చూపేవాడు. ‘మీరంతా పరస్పరం ప్రేమగా ఉండండి, వినయంగా నడుచుకోండి’ అంటూ ప్రజలకూ, శిష్యులకూ ఎన్నిసార్లు చెప్పినా, ఆ మాట ఆచరణకు దూరంగా, అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. అది గమనించిన ప్రభువు ఒకరోజు తనే నడుం బిగించాడు. నిశ్శబ్దంగా ఆచరించి చూపాలనుకున్నాడు. ఒక నీళ్ల పాత్రను, మరో పళ్లాన్ని తీసుకున్నాడు. అక్కడున్న పన్నెండుమంది శిష్యులను పిలిచి వరసగా కూర్చోమన్నాడు. తమ గురువు ఏం చేస్తున్నదీ ఎవరికీ అర్థం కాలేదు. విస్మయంగా చూస్తున్నారు. అప్పుడు ప్రభువు ఒక్కొక్కరి పాదాలనూ పళ్లెంలోకి తీసుకుని కడగటం మొదలుపెట్టాడు. నడుముకు కట్టిన తెల్లటి వస్త్రాన్ని తీసి, దానితో పాదాల తడి తుడుస్తున్నాడు. శిష్యుల కళ్ల నుంచి పశ్చాత్తాప బాష్పాలు వారిని శుద్ధి చేస్తుంటే, వారి శిరస్సులు సిగ్గుతో వంగి పోయాయి. అంతే.. వారికి మహత్తర సందేశం అందింది. 

డాక్టర్‌ దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు