పోయినోళ్లు మంచోళ్లు

ఒకరోజు రమణాశ్రమంలో ‘పోయినోళ్లంతా మంచోళ్లు అంటారు.. ఎందుకు?’ అనడిగాడో శిష్యుడు. దానికి రమణమహర్షి ‘వాళ్లకు దేహాభిమానం ఉండదు కనుక మంచివారు. ఎవరైతే దేహాభిమానాన్ని వదిలేస్తారో వారు ఆనందమయులు.

Published : 20 Oct 2022 00:11 IST

కరోజు రమణాశ్రమంలో ‘పోయినోళ్లంతా మంచోళ్లు అంటారు.. ఎందుకు?’ అనడిగాడో శిష్యుడు.

దానికి రమణమహర్షి ‘వాళ్లకు దేహాభిమానం ఉండదు కనుక మంచివారు. ఎవరైతే దేహాభిమానాన్ని వదిలేస్తారో వారు ఆనందమయులు. అలా సాధ్యం కానివాళ్లు మరణానంతరం ఆ స్థితిని చేరుకుంటారు. అది చనిపోయాక సాధించిన మంచి కనుక ఆ నానుడి వచ్చింది. మనిషి నిద్రకు భయపడడు. నిద్రించిన తర్వాత మేల్కొని తాను హాయిగా నిద్ర పోయానని చెబుతాడు. మనం రోజూ పోయే నిద్ర తాత్కాలిక మరణం, శాశ్వత నిద్రే మరణం. ఇక మనసును ఆత్మలో లీనం చేయడమే సమాధి. ఇది కూడా ఒక రకమైన మరణమే. శరీరాన్ని ఆశ్రయించి ఉండే అహంకారం మరణంతో ఉనికిని కోల్పోతుంది. అహం నశించిన జీవులు పరమాత్మ రూపాలు. మరోలా చెప్పాలంటే... నిద్రపోవడం, మేలుకోవడం ప్రకృతిలోని ఉదయ-అస్తమయాలు. హృదయంలోని పరమాత్మ జ్యోతే ఆత్మ. జీవించి ఉన్నంతవరకు జీవాత్మ అయితే.. మరణం తర్వాత పరమాత్మలో లీనమవుతోంది’ అంటూ వివరించారు. 

- శ్రావణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు