భిక్ష గడప దాటే ఎందుకివ్వాలి?
భిక్ష అంటే పూజ్యులైన సాధువులకు గౌరవంతో ఇచ్చే సొమ్ము. ఉన్నంతలో కొంత దానం చేయడం మన కర్తవ్యం.
భిక్ష అంటే పూజ్యులైన సాధువులకు గౌరవంతో ఇచ్చే సొమ్ము. ఉన్నంతలో కొంత దానం చేయడం మన కర్తవ్యం.
యజ్ఞశిష్టాశినః సంతోముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే
తే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్
ఒకరికి పెట్టకుండా తినడం విషంతో సమానం అన్నది భగవద్గీతలోని ఈ శ్లోకానికి అర్థం. కాబట్టి ‘భిక్షాం దేహి’ అంటూ వాకిట్లోకి వచ్చేది స్వయంగా విష్ణుమూర్తేనని, మనల్ని ఉద్ధరించడానికే వచ్చారని భావించాలి. అతిథిని అర్చించి భిక్ష ఇవ్వాలి. ఇందులో నా చెయ్యి పైన ఉంది, నీది కింద.. అనే రాక్షస భావం ఈషణ్మాత్రమైనా మనసులో ఉండకూడదు. ఇచ్చేదీ, ఇప్పిస్తున్నదీ భగవంతుడే అనుకోవాలి. అందుకే ‘శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం’ అంటుంది వేదం. అలాగే గీతలోని
దాతవ్యమితి యత్ దానం దీయతే అనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తత్ దానం సాత్వికం స్మృతమ్
శ్లోకాన్ని అనుసరించి ఇంట్లోకి పిలిచి ఇవ్వడంలో గౌరవభావం ఉంటుంది. దాత, పతిగ్రహీత సమస్థాయిలో ఉండటం ఇద్దరూ సమానమేనని చెప్పడం. ఇల్లు వాకిటి కంటే ఎత్తులో ఉంటుంది కాబట్టి గడప దాటి వెళ్లి తన స్థాయి తగ్గించుకుని ఇవ్వడం భిక్షార్థిపైన గౌరవం చూపడమౌతుంది. వచ్చిన వ్యక్తికి మొక్కుబడిగా గాక గౌరవంగా ఇవ్వడం ఉత్తమదానం అనిపించుకుంటుంది.
డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్య
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!
-
జీతం లేకుండా పనిచేస్తానన్న సీఈఓ.. కారణం ఇదే..!