మంచి వైపు పయనం
ఆధ్యాత్మిక విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు, మంచి పనులు మొదలుపెడుతున్నప్పుడు....
ధర్మ సందేహం
మంచి వైపు పయనం
ఆధ్యాత్మిక విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు, మంచి పనులు మొదలుపెడుతున్నప్పుడు ఓంకారంతో పాటు స్వస్తిక్ చిహ్నాన్ని కూడా రాస్తారు. స్వస్తిక్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యం తెలియజేయండి?
స్వస్తిక్ మన సంప్రదాయంలో శుభానికి సంకేతం. ఈ చిహ్నంలో కొన్ని విశిష్టతలు ఉన్నాయి. స్వస్తి కలిగించేది స్వస్తిక్. అంటే శుభాలను ప్రసాదించేదన్నమాట. తూర్పు నుంచి బయల్దేరి.. సవ్యదిశగా చేసే ప్రయాణంలో గమ్యం ఉత్తరం అవుతుంది. ఉత్ తరం.. ఉత్తరం అంటే ఉన్నదానికంటే శ్రేష్ఠమైనది, మేలైనది అని అర్థం. స్వస్తిక్ శ్రేయోదాయకమైన గమనాన్ని సూచిస్తుంది. మరికొందరి దృష్టిలో స్వస్తిక్ గుర్తు సూర్యుడికి సంకేతంగా భావిస్తారు. సూర్యుడు అంటే వెలుగు, విద్య, జ్ఞానం మొదలైన వాటికి ప్రతీక. అందువల్ల స్వస్తిక్ శుభసూచకమని మన పెద్దల అభిప్రాయం. మనకు పూర్ణకుంభం, ఓంకారం ఎలాంటివో స్వస్తిక్ గుర్తు కూడా శుభానికీ, జ్ఞానానికీ చిహ్నంగా చెప్పుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ