ధర్మ సందేహం 

ఏకోదరులైన అన్నదమ్ములకు ఒకే సంవత్సరంలో వివాహం చేయడం శాస్త్రం నిషేధించింది. వివాహ క్రతువులో భాగంగా స్నాతక వ్రతం నిర్వహిస్తారు. స్నాతకోత్సవం.. గృహస్థాశ్రమ ప్రవేశ యోగ్యతను కలిగించే ఒక వైదిక కార్యక్రమం. ఈ ప్రక్రియ ప్రకారం...

Updated : 12 Oct 2018 23:57 IST

...అప్పుడు చేయొచ్చు!

* ఒకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములకు ఒకే సంవత్సరంలో వివాహం చేయకూడదని అంటారు ఎందుకు? 
ఏకోదరులైన అన్నదమ్ములకు ఒకే సంవత్సరంలో వివాహం చేయడం శాస్త్రం నిషేధించింది. వివాహ క్రతువులో భాగంగా స్నాతక వ్రతం నిర్వహిస్తారు. స్నాతకోత్సవం.. గృహస్థాశ్రమ ప్రవేశ యోగ్యతను కలిగించే ఒక వైదిక కార్యక్రమం. ఈ ప్రక్రియ ప్రకారం ఒకే సంవత్సరం అన్నదమ్ములకు వివాహం చేయకూడదని చెబుతారు. వంశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన నియమమిది. అయితే అన్నదమ్ముల వివాహం మధ్యలో ఏడాది వ్యవధి ఉండాలని ఎక్కడా లేదు. ఈ సంవత్సరం చివరిలో ఒకరికి, ఉగాదితో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో మరొకరికి వివాహం చేయవచ్చు. ఆడపిల్లల పెళ్లి విషయంలో ఇలాంటి నియమాలేం లేవు.

-మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు