ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు

గత ఏడాది మార్చి నుంచి దేశంలో కొవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో కొవిడ్‌ తొలి దశ చివరిలో ఉంది. అప్పుడప్పుడే అన్నీ ప్రారంభమవుతున్నాయి.

Published : 07 Nov 2021 15:17 IST

 తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి 

గత ఏడాది మార్చి నుంచి దేశంలో కొవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో కొవిడ్‌ తొలి దశ చివరిలో ఉంది. అప్పుడప్పుడే అన్నీ ప్రారంభమవుతున్నాయి. కొద్దిగా తగ్గినా సెప్టెంబరులో తొలి బ్రహ్మోత్సవాలను  కొవిడ్‌ నిబంధనల మేరకు ఏకాంతంగా నిర్వహించాం. ఆ తర్వాత వచ్చిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే చేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌, మే జూన్‌ నెలల్లో కొవిడ్‌ ఉద్ధృతంగా వచ్చింది. ఇప్పుడు సంఖ్య తగ్గినా రెండో దశ అయిపోయిందని చెప్పలేం. ధార్మిక కార్యక్రమాలు తక్కువ సంఖ్యలో చేసుకోవాలని కేంద్రం సూచించింది. శ్రీవారి బ్రహ్మోత్సవలను తిరుమాఢ వీధుల్లో చేస్తే లక్షల మంది భక్తులు వస్తారు. ఇదే జరిగితే కొవిడ్‌ విస్తరించే ప్రమాదం ఉంది. అందువల్లే ఈ ఏడాది సైతం శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించాం. అటు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తూనే ఇటు భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. సాధారణ భక్తులకు సైతం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటికే రోజుకు 8 వేల టోకెన్లను ఆన్‌లైన్‌లో కేటాయించాం. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని