గుమ్మానికి మామిడాకులెందుకు?

మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి- ఆకులను పంచపల్లవాలంటారు. వీటిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు.

Published : 29 Dec 2022 00:26 IST

మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి- ఆకులను పంచపల్లవాలంటారు. వీటిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు. పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి మామిడాకులను కట్టడం శుభసూచకంగా భావిస్తారు. యజ్ఞ యాగాదుల్లో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూజా కలశంలోనూ మామిడాకులను ఉపయోగిస్తాం. రామాయణ, భారతాల్లో ప్రస్తావించిన దాన్ని బట్టి మామిడి ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి సంకేతం. మామిడాకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఎక్కువమంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుమ్మాలకు మామిడాకులను తోరణాలుగా కట్టడం వలన పరిసరాల్లోని గాలి పరిశుభ్రమై ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉండటాన ఆర్థిక సమస్యలు తలెత్తవు. వాకిట్లో అలంకరించిన మామిడి తోరణం వల్ల దుష్టశక్తులు నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు.

డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని