GATE 2024 Key: గేట్‌ 2024 ప్రాథమిక కీ విడుదల

గేట్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఈ కింది ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా అభ్యర్థులు పేపర్ల వారీగా కీని పొందొచ్చు.

Published : 19 Feb 2024 15:01 IST

బెంగళూరు: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2024) పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది.  ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా 200 నగరాల్లో రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరు(IISc)  నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసిన సంస్థ తాజాగా మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, ప్రాథమిక కీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు సవాల్‌ చేయొచ్చని పేర్కొంది. గేట్‌ పరీక్షల ఫలితాలు మార్చి 16న ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని