నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సికిందరాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌సీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 24 May 2021 00:11 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సికిందరాబాద్‌

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సికిందరాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌సీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 96

పోస్టులు: స్పెషలిస్ట్‌ డాక్టర్‌, జీడీఎంవో, స్టాప్‌ నర్సు, హాస్పిటల్‌ అటెండెంట్‌, ఫార్మాసిస్ట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత:  పోస్టుని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ/ జీఎన్‌ఎం, బీఫార్మసీ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 2021 జూన్‌ 04, 05.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. ఈమెయిల్‌: contractmedicalhyb@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 2021, మే 29.

వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in/


డీఆర్‌డీఎల్‌-హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కి చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబోరేటరీ (డీఆర్‌డీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)

* మొత్తం ఖాళీలు: 10

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, గేట్‌ అర్హత.

ఎంపిక విధానం: ఇంజినీరింగ్‌ డిగ్రీ మార్కులు, గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డీఆర్‌డీఓ-డీఆర్‌డీఎల్‌, ఏపీజే. అబ్దుల్‌కలాం, మిసైల్‌ కాంప్లెక్స్‌, కంచన్‌బాగ్‌ పీవో, హైదరాబాద్‌-500058.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. 

వెబ్‌సైట్‌:  https://www.drdo.gov.in/


ప్రవేశాలు

ఐఐఎస్‌టీలో పీజీ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన కేరళ (తిరువనంతపురం)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియోనిక్స్‌, మ్యాథమేటిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

వయసు: 16.06.2021 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, జూన్‌ 16.

వెబ్‌సైట్‌:  ‌www.iist.ac.in/


మహీంద్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ, అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన ఎస్‌సీ జాన్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంయుక్తంగా 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
ప్రోగ్రాములు: బీఏ (ఎకనామిక్స్‌ ఖీ ఫైనాన్స్‌), బీబీఏ (డిజిటల్‌ టెక్నాలజీస్‌, కంప్యూటేషనల్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌) కోర్సు వ్యవధి:  మూడు సంవత్సరాలు
అర్హత: మ్యాథమేటిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత, ఎస్‌ఏటీ స్కోర్‌. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, మే 30.

వెబ్‌సైట్‌:
www.mahindrauniversity.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని