నోటీస్‌బోర్డు

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 18 Oct 2021 06:36 IST

ప్రభుత్వ ఉద్యోగాలు


ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 2500

* ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.

వయసు: 01 ఫిబ్రవరి 2002 నుంచి 31 జనవరి 2005 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకు రూ.14600 అనంతరం రూ.21700 - రూ.69100.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.

కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 2022 నుంచి.

శిక్షణ వ్యవధి: ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ 09 వారాలు, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ 22 వారాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 25, 2021.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/en


నేవీలో 300 సెయిలర్‌ ఖాళీలు

ఇండియన్‌ నేవీ అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్స్‌ మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌) మొత్తం ఖాళీలు: 300

అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 01 ఏప్రిల్‌ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకు రూ.14600 అనంతరం రూ.21700 - రూ.69100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.

కోర్సు ప్రారంభం: ఏప్రిల్‌ 2022 నుంచి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్‌ 29, 2021

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 02, 2021.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/en


యాదాద్రి భువనగిరి జిల్లాలో 42 మెడికల్‌ స్టాఫ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 42

పోస్టులు: ఎంపీహెచ్‌ఏ/ ఏఎన్‌ఎం, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ/ బీఎస్సీ, డిప్లొమా(ఫార్మసీ)/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. 90 మార్కులు అకడమిక్‌ మెరిట్‌, 10 మార్కులు వయసు ఆధారంగా కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డీఎంహెచ్‌ఓ, యాదాద్రి భువనగిరి జిల్లా.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 18, 20, 21 https://yadadri.telangana.gov.in


వీఎంఎంసీ-న్యూదిల్లీలో 447 సీనియర్‌ రెసిడెంట్లు

న్యూదిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలోని వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్‌ కాలేజీ (వీఎంఎంసీ) శాశ్వత ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సీనియర్‌ రెసిడెంట్లు మొత్తం ఖాళీలు: 447

విభాగాలు: అనెస్తేషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌, హెమటాలజీ, ల్యాబ్‌ ఆంకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.

వయసు: 45 నుంచి 50 ఏళ్లు మధ్య ఉండాలి. పని అనుభవం: స్పెషలైజేషన్‌, అర్హతను అనుసరించి కనీసం రెండేళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.67700 దరఖాస్తు ఫీజు: రూ.800.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: మెడికల్‌ సూపరింటెండెంట్‌, వీఎంఎం కాలేజీ, సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రి, న్యూదిల్లీ-110029.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 01, 2021

వెబ్‌సైట్‌: http://www.vmmc-sjh.nic.in/


ఎఫ్‌సీఐ-పంజాబ్‌లో 860 వాచ్‌మెన్‌

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) పంజాబ్‌లో వాచ్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 860

అర్హత: ఐదు/ ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 01.09.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.23000 నుంచి రూ.64000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ (పీఈటీ) ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.250.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 10, 2021.

వెబ్‌సైట్‌: https://fci.gov.in/


వాక్‌-ఇన్స్‌


ఏఈసీఎస్‌-మణుగూరులో టీచర్లు

భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన మణుగూరులోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌(ఏఈసీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టీజీటీ పోస్టులు

అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.

వాక్‌ఇన్‌ వేదిక: ఏఈసీఎస్‌ మణుగూరు, హెచ్‌డబ్ల్యూపీ(ఎం) కాలనీ, అశ్వపురం, భద్రాద్రి కొత్తగూడెం.

వాక్‌ఇన్‌ తేది: అక్టోబర్‌ 26, 2021.

వెబ్‌సైట్‌: http://aecsmanuguru.in/indexaecs.php


అప్రెంటిస్‌షిప్‌


యూసీఐఎల్‌-తుమ్మలపల్లిలో..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన తుమ్మలపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) 2021-22 సంవత్సరానికి గాను కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 30

విభాగాలు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌వీసీటీ) ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు. ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 02, 2021.

వెబ్‌సైట్‌: www.ucil.gov.in/tummalapalleproject.html


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని