నోటీస్‌ బోర్డు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 21 Mar 2022 06:19 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 111 టెక్నీషియన్‌ ఖాళీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 111 విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌-51, ఎలక్ట్రికల్‌ -32, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-28. అర్హత: విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ (ఫిజిక్స్‌) డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 31 ఏళ్లు మించకూడదు. జీతభత్యాలు: నెలకు రూ.22000-రూ.60000. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్త్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 04, 2022.

వెబ్‌సైట్‌: www.rcfltd.com/


ఎయిమ్స్‌-గోరఖ్‌పూర్‌లో 108 ఫ్యాకల్టీ పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఫ్యాకల్టీ (మెడికల్‌ - నాన్‌ మెడికల్‌)

మొత్తం ఖాళీలు: 108 విభాగాలు: అనెస్థీషియా, అనాటమీ, కార్డియాలజీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌ తదితరాలు. పోస్టుల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్‌-29, అడిషనల్‌ ప్రొఫెసర్‌-22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-24. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-33. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం/ పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. వయసు: 50-58 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనశ్రేణి: నెలకు రూ.1,01,500 -రూ.1,68,900. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: రిక్రూట్‌మెంట్‌ సెల్‌(అకడమిక్‌ బ్లాక్‌), ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌, కున్రఘాట్‌, గోరఖ్‌పూర్‌, యూపీ-273008. దరఖాస్తు ఫీజు: రూ.3000. దరఖాస్తులకు చివరితేది: మే 02, 2022. వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/


గాంధీ మెడికల్‌ కాలేజీ/ హాస్పిటల్‌లో 135 ఖాళీలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీ/ గాంధీ హాస్పిటల్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 135 పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 115, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌-20 విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఓబీజీ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత. వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనశ్రేణి: నెలకు రూ.52000 -రూ.1,25,000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ది సూపరింటెండెంట్‌, గాంధీ హాస్పిటల్‌, ముషీరాబాద్‌, సికిందరాబాద్‌. దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 05, 2022.

వెబ్‌సైట్‌: https://dme.telangana.gov.in/


ఐఐటీ-హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఫ్యాకల్టీ ఖాళీలు

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌. విభాగాలు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. వయసు: 35-55 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనశ్రేణి: నెలకు రూ.1,01,500 -రూ.1,59,100. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 15, 2022. వెబ్‌సైట్‌: https://iith.ac.in/


స్పా-విజయవాడలో పీజీ, డాక్టోరల్‌ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా) 2022-2023 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

స్పాలో పీజీ, డాక్టోరల్‌ ప్రోగ్రాములు

1. పీజీ ప్రోగ్రాములు: బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: రెండేళ్లు మొత్తం ఖాళీలు: 25  2. డాక్టోరల్‌ ప్రోగ్రాములు(ఫుల్‌ టైం ఖీ పార్ట్‌ టైం): గేట్‌/ జేఆర్‌ఎఫ్‌/ సీఈఈడీ అర్హత సాధించాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.3000. చిరునామా: ది డీన్‌ అకడమిక్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడ, సర్వే నం 4/4, ఐటీఐ రోడ్‌, విజయవాడ-520008. దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్‌ 06, 2022. వెబ్‌సైట్‌: www.spav.ac.in/spavadmissions.html




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు