నోటిఫికేషన్స్‌

కేరళ, ఉద్యోగమండల్‌లోని ‘ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌’ 98 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7000 స్టైపెండ్‌ లభిస్తుంది.

Published : 10 May 2024 00:21 IST

అప్రెంటిస్‌ ఖాళీలు

కేరళ, ఉద్యోగమండల్‌లోని ‘ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌’ 98 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7000 స్టైపెండ్‌ లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు 20 మే 2024 లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ 24 మే 2024.


టీచింగ్‌ పోస్టులు

చాణక్యపురి (న్యూదిల్లీ)లోని నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో సీనియర్‌ సెకండరీ, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు 24 మే 2024 లోపు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.


యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ముంబయిలోని టెక్స్‌టైల్స్‌ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన 40 యంగ్‌ ప్రొఫెషనల్‌ - ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (టెక్స్‌టైల్‌ టెస్టింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వేతనం నెలకు రూ.26,000. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది 31 మే 2024.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని