12 వేలకు పైగా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు

గత రెండేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంటర్న్‌షిప్‌లకు ప్రాముఖ్యం పెరిగింది. దీంట్లో భాగంగా నియామక, శిక్షణల వేదిక ‘ఇంటర్న్‌శాల’ చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. ఒకపక్క చదువుకుంటూనే ఇంటి నుంచి పని అనుభవాన్ని సంపాదించేలా విద్యార్థుల కోసం ‘చలో ఇండియా..

Updated : 20 Apr 2022 05:34 IST

చదువుకుంటూనే సంపాదించొచ్చు. ఇంట్లో నుంచే ఉద్యోగానుభవాన్ని పొందొచ్చు. ఇదంతా వర్చువల్‌  ఇంటర్న్‌షిప్‌లతో సాధ్యమవుతుంది. 

గత రెండేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంటర్న్‌షిప్‌లకు ప్రాముఖ్యం పెరిగింది. దీంట్లో భాగంగా నియామక, శిక్షణల వేదిక ‘ఇంటర్న్‌శాల’ చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. ఒకపక్క చదువుకుంటూనే ఇంటి నుంచి పని అనుభవాన్ని సంపాదించేలా విద్యార్థుల కోసం ‘చలో ఇండియా.. లెట్స్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో 12,000కు పైగా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం లభిస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మే 8 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 

ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, డిజైన్, మీడియా, కామర్స్‌ విభాగాలకు చెందిన విద్యార్థులేకాకుండా.. నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులెవరైనా దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైన విద్యార్థులకు స్టైపెండ్‌ ఉంటుంది. అత్యధికంగా నెలకు రూ.25,000 వరకు స్టైపెండ్‌ పొందొచ్చు. 

కంటెంట్‌ రైటింగ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, వెబ్‌ అండ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ అకౌంటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, గ్రాఫిక్‌ డిజైన్, యూఐ/యూఎక్స్‌ డిజైన్, వీడియో మేకింగ్‌ అండ్‌ ఎడిటింగ్, హ్యూమన్‌ రిసోర్సెస్‌... మొదలైన విభాగాల్లో ఈ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు

వెబ్‌సైట్‌: https://internshala.com/work-from-home


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని