ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సులు ఎక్కడ?

మా అబ్బాయి ఇంటర్‌ పూర్తిచేశాడు. ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటే ఆసక్తి. సంబంధిత కోర్సులు, వాటి ప్రవేశ వివరాలను తెలపండి....

Updated : 25 Sep 2021 21:48 IST

మా అబ్బాయి ఇంటర్‌ పూర్తిచేశాడు. ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటే ఆసక్తి. సంబంధిత కోర్సులు, వాటి ప్రవేశ వివరాలను తెలపండి. తెలుగు రాష్ట్రాల్లో అందించే సంస్థలేవి? స్థానిక సంస్థల్లో అందించే కోర్సులను ఏ ప్రాతిపదికన నమ్మొచ్చు?
- మహేష్‌

టీవలికాలంలో ఎథికల్‌ హ్యాకింగ్‌పై చాలామంది విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరగడంతో పాటు అంతర్జాల వినియోగదారుల సంఖ్య కూడా పెరగడం వల్ల సమాచార, డేటా రక్షణకు ఎథికల్‌ హ్యాకర్ల అవసరం పెరుగుతోంది. మనదేశంలో ఎథికల్‌ హ్యాకింగ్‌కు సంబంధించి క్రమబద్ధ్దమైన కోర్సు అంటూ ఏదీ లేదు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్‌ తరువాత కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌లో బీటెక్‌ లేదా నెట్‌ వర్కింగ్‌ అండ్‌ సెక్యూరిటీలో బీఎస్సీ, ఐటీ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీలో బీటెక్‌ లాంటి కోర్సులను చెయ్యవచ్ఛు డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడే యూఎస్‌ఏకి చెందిన ఇ.సి. కౌన్సిల్‌ నిర్వహించే సి.ఇ.హెచ్‌ (సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌) సర్టిఫికెట్‌ కోర్స్‌ లాంటి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు చెయ్యవచ్ఛు ఎథికల్‌ హ్యాకింగ్‌కి సంబంధించి Coursera, edX, Udemy లలో అందుబాటులో ఉన్న ఆన్లైన్‌ కోర్సులు కూడా డిగ్రీతో పాటుగా చేయవచ్చు.

గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ ‘సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌’లో డిగ్రీ కోర్సులకు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్‌లు నిర్వహిస్తుంది. డిగ్రీ చేసిన తరువాత ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో పీజీ కోర్సుని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఐఐఐటి, హైదరాబాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లు అందిస్తున్నాయి. మద్రాసు యూనివర్సిటీ సైబర్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎమ్మెస్సీ కోర్స్‌ని రెగ్యులర్‌/ దూరవిద్య ద్వారా అందిస్తోంది. ప్రైవేట్‌ కంప్యూటర్‌ సంస్థల్లో అందించే ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సులు ప్రామాణికతను ఆ సంస్థల్లో అంతకుముందు శిక్షణ తీసుకున్న పూర్వ విద్యార్ధులతో మాట్లాడి నిర్ధారించుకోండి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

కోర్సులు, కెరియర్‌లకు సంబంధించి మీకు ఏ సందేహాలు ఉన్నా edc@eenadu.in కు మెయిల్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని