విదేశాల్లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ ?

ఇంటర్‌ చదువుతున్నాను. ఇతర దేశాల్లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుంది. దీనికోసం ఏదైనా ప్రవేశ పరీక్ష రాయాలా?

Published : 17 Jan 2022 00:46 IST

ఇంటర్‌ చదువుతున్నాను. ఇతర దేశాల్లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుంది. దీనికోసం ఏదైనా ప్రవేశ పరీక్ష రాయాలా?

- ప్రవీణ్‌  


ఇతర దేశాల్లో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకమైన ప్రవేశ పద్ధతిని అనుసరిస్తుంది. విదేశాల్లో ఉన్న చాలా విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి శాట్‌ పరీక్షలో వచ్చిన స్కోరుతో పాటు ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించే టోఫెల్‌/ ఐఈఎల్‌ టీఎస్‌/ పీటీఈలో కూడా మంచి స్కోర్‌ను ఆశిస్తాయి. మరికొన్ని యూనివర్సిటీలు మాత్రం శాట్‌/యాక్ట్‌/ టోఫెల్‌/ఐఈఎల్‌ టీఎస్‌/ పీటీఈల్లో ఏదో ఒక స్కోరును పరిగణించి కూడా ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ పరీక్షల్లో అత్యుత్తమ స్కోరు సాధించినట్లయితే మీకు మంచి ఫైనాన్సియల్‌ ఎయిడ్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.  

కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ కోర్సు విదేశాల్లోని చాలా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. మీరు చదవాలనుకొంటున్న యూనివర్సిటీల వెబ్‌ సైట్‌లకు వెళ్ళి ప్రవేశానికి అవసరమైన పరీక్షలు, రావాల్సిన స్కోర్‌ల గురించి తెలుసుకొని ఆ దిశలో ప్రయత్నాలు చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే- పైన చెప్పిన పరీక్షలతో పాటు దరఖాస్తులో మీరు పేర్కొన్న మీ గత విజయాలు, మార్కులు,  ప్రాజెక్టులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డ్‌లు, ఈ  కోర్సు మీరు ఎందుకు చదవాలనుకొంటున్నారో తెలిపే వ్యాసం, అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ప్రవేశం కల్పిస్తారు. వీటన్నింటి గురించి పూర్తి అవగాహనకు అవసరమైతే ఏదైనా నమ్మకమైన ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీనీ సంప్రదించవచ్చు.  

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని