దూరవిద్యలో ఎంటెక్‌?

బీటెక్‌ (ఈఈఈ) రెగ్యులర్‌గా చదివాక జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎంటెక్‌ చదవాలని ఉంది. దూరవిద్యలో చేయడానికి ఎక్కడ వీలుంటుంది?

Updated : 28 Mar 2022 06:43 IST

బీటెక్‌ (ఈఈఈ) రెగ్యులర్‌గా చదివాక జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎంటెక్‌ చదవాలని ఉంది. దూరవిద్యలో చేయడానికి ఎక్కడ వీలుంటుంది?

- వి. విజయ్‌కుమార్‌, జగ్గంపేట

* ఉద్యోగం చేస్తూ కూడా ఎంటెక్‌ చదవాలనుకోవడం అభినందనీయం. ఎంటెక్‌ను దూరవిద్యలో చేయడానికి అవకాశం లేదు. ఈ కోర్సును చాలా ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌గా అందిస్తున్నాయి. మీరు ఎంటెక్‌ కోర్సును రెగ్యులర్‌గా చదవాలనుకొంటే రెండు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, మంచి విద్యాసంస్థలో చదివే ప్రయత్నం చేయండి.

అతి తక్కువ యూనివర్సిటీల్లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో క్లాసులు సాయంత్రం పూట నిర్వహిస్తారు.  బిట్స్‌ పిలానిలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని