ఉన్నత విద్యకు ఏ అవకాశాలు?

బీఏ (హెచ్‌ఈపీ) చదువుతున్నాను. ఈ కోర్సు తర్వాత ఉండే ఉన్నతవిద్యావకాశాలు ఏమిటి?

Updated : 04 Apr 2022 06:38 IST

బీఏ (హెచ్‌ఈపీ) చదువుతున్నాను. ఈ కోర్సు తర్వాత ఉండే ఉన్నతవిద్యావకాశాలు ఏమిటి?

- జి. అరుణ్‌కుమార్‌

* మీరు బీఏ (హెచ్‌ఈపీ)లో చదివిన హిస్టరీ, ఎకనమిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ల్లో మీకు బాగా నచ్చిన సబ్జెక్టులో ఎంఏ చేయవచ్చు. ఎకనమిక్స్‌ కోర్సులో విశిష్ట స్పెషలైజేషన్‌గా ఉన్న ఫైనాన్సియల్‌ ఎకనమిక్స్‌లోనూ ఎంఏ చేసే అవకాశం ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆంత్రపాలజీ, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషల్‌ వర్క్‌, సైకాలజీ, ఎడ్యుకేషన్‌, ఫిలాసఫీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చదవొచ్చు. డిగ్రీలో మీరు చదివిన ఇంగ్లిష్‌, తెలుగు/ హిందీ/ సంస్కృతంలో పీజీ చేయవచ్చు. భాషాశాస్త్రంపై ఆసక్తి ఉంటే లింగ్విస్టిక్స్‌లో పీజీ చదవొచ్చు. విభిన్న భాషా సాహిత్యాలపై తులనాత్మక అధ్యయనం చేయాలనుకొంటే కంపారిటివ్‌ లిటరేచర్‌లో ఎంఏ చేయొచ్చు.

న్యాయశాస్త్రం మీద ఆసక్తి ఉన్నట్లయితే ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ అవకాశమూ ఉంది. జర్నలిజం రంగంపై అభిరుచి ఉంటే అందులో పీజీ చేసి మీడియా రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఎంబీఏ కోర్సు చేసి, ఉద్యోగంలో త్వరగా స్థిరపడొచ్చు. డిగ్రీలో మీరు హిస్టరీ చదివారు కాబట్టి, టూరిజంలో పీజీ చదివే అవకాశాల గురించి ఆలోచించండి. పాఠశాలల్లో బోధన చేయాలనివుంటే బీఈడీ/ డీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడవచ్చు. వ్యాయామ విద్యపై ఆసక్తి ఉంటే బీపీఈడీ గురించి ఆలోచించవచ్చు. గ్రామీణాభివృద్ధి రంగంలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ లో పీజీ చేయొచ్చు. మీరు ఇంటర్‌లో మేథమేటిక్స్‌ చదివివుంటే ఎంసీఏ కోర్సులో చేరే వీలుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని