ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను నాలుగో తరగతి చదవకుండా జంప్‌ చేసి నేరుగా అయిదో తరగతి చదివాను. ఓటీఆర్‌ నింపేటప్పుడు అకడమిక్‌ ఇయర్స్‌ కాలమ్‌లో ఏమని

Published : 24 Apr 2022 02:01 IST

నేను నాలుగో తరగతి చదవకుండా జంప్‌ చేసి నేరుగా అయిదో తరగతి చదివాను. ఓటీఆర్‌ నింపేటప్పుడు అకడమిక్‌ ఇయర్స్‌ కాలమ్‌లో ఏమని పేర్కొనాలి?

- రమేష్‌

జ: మీరు అకడమిక్‌ ఇయర్స్‌ కాలమ్‌ నింపేటప్పుడు నాలుగో తరగతిలో డ్యాష్‌(-) పెట్టి వదిలేయండి. ఉదాహరణకు మీరు మూడో తరగతి 2012-13లో చదివి ఉంటే నాలుగో తరగతి డ్యాష్‌ పెట్టి అయిదో తరగతి కాలమ్‌లో 2013-14 అని నింపితే సరిపోతుంది. మీరు నేరుగా మూడో తరగతి నుంచి అయిదో తరగతిలోకి వెళ్లారని వారికి అర్థమైపోతుంది.


నేను తెలుగు మీడియంలో బీకామ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. త్వరలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల \కానుంది. తక్కువ వ్యవధిలో ప్రిపరేషన్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి, ఏ మెటీరియల్‌ చదవాలో తెలియజేయగలరు.

- కృష్ణ

జ: గ్రూప్‌-1 వచ్చే వరకు వేచి చూడకుండా ఎంత త్వరగా ప్రిపరేషన్‌ మొదలు పెడితే అంత మంచిది. ప్రిలిమినరీ పరీక్షకు మౌలికాంశాలను క్షుణ్ణంగా చదివి బిట్లు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది. మెయిన్స్‌ను డిస్క్రిప్టివ్‌ ప్రధానంగా నిర్వహిస్తారు. దీనికి సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. రాసే నైపుణ్యం, భాషపై పట్టు అవసరం. ప్రిపరేషన్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ దినపత్రికను చదివి నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.


ఒకటి  నుంచి ఏడో తరగతి వరకు ఒకే జిల్లాలో రెండు వేర్వేరు పాఠశాలల్లో చదువుకున్నాను. నా దగ్గర నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్‌ ఉంది. కానీ ఒకటి నుంచి మూడో తరగతికి సంబంధించి ఏ సర్టిఫికెట్‌ లేదు. గరిష్ఠంగా చదివిన కాలానికి చెందిన స్టడీ సర్టిఫికెట్‌ సరిపోతుందా? లేదా ఒకటి నుంచి మూడో తరగతికి సంబంధించింది కూడా అవసరమా?

- రవితేజ

జ: ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదివిన స్కూల్‌ ఇప్పటికీ ఉంటే అక్కడి నుంచి స్టడీ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. లేదా ఓటీఆర్‌ కాలమ్‌ నింపేటప్పుడు చదివిన ఏడాది ప్రైవేట్‌ అని రాస్తే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని