సీఏ చేస్తే...?

చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినవారికి  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  మెరుగైన ఉద్యోగావకాశాలున్నాయి. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లాంటి

Updated : 25 Apr 2022 06:35 IST

సీఏ కోర్సు చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలపండి.   

 - ఎం. ఖ్యాతి 

* చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినవారికి  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  మెరుగైన ఉద్యోగావకాశాలున్నాయి. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లాంటి ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కూడా సీఏగా అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో ఫైనాన్స్‌ మేనేజర్‌, అకౌంట్స్‌, ఆడిట్‌ మేనేజర్‌ లాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. సీఏ పూర్తి చేసినవారు బ్యాంకింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఎంబీఏ చదివిన నిపుణులతో పోటీ పడుతున్నారు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా, క్రెడిట్‌ అనలిస్టులుగా, ఆడిట్‌ బాధ్యులుగా ప్రభుత్వ రంగ సంస్థలు సీఏలను తీసుకుంటాయి. వీరు సొంతంగానూ ప్రాక్టీస్‌ నిర్వహించుకొనే అవకాశం ఉంది. 

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌ 
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని