ఒకేసారి రెండు డిగ్రీలు?

బీటెక్‌ చేశాను. బీఎస్సీ (ఎంపీసీ) దూరవిద్య ద్వారా చదువుతున్నాను. ఇది వచ్చే ఏడాది పూర్తవుతుంది. ఇప్పుడు ఎంఎస్సీ (మ్యాథ్స్‌) దూర విద్యలో చేయాలనుకుంటున్నాను. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవొచ్చు...

Published : 01 Jun 2022 00:45 IST

బీటెక్‌ చేశాను. బీఎస్సీ (ఎంపీసీ) దూరవిద్య ద్వారా చదువుతున్నాను. ఇది వచ్చే ఏడాది పూర్తవుతుంది. ఇప్పుడు ఎంఎస్సీ (మ్యాథ్స్‌) దూర విద్యలో చేయాలనుకుంటున్నాను. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవొచ్చు కదా?

- కె. శ్రీరామ్‌

టీవల జారీ అయిన యూజీసీ మార్గదర్శకాల ప్రకారం రెండు డిగ్రీలు ఒకేసారి చదివే అవకాశం ఉంది. కానీ ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చదవాలంటే బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. మీరు ఇంకా బీఎస్సీ పూర్తి చేయలేదు కాబట్టి  ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చదవడానికి అవకాశం లేదు. కాకపోతే, కొన్ని విశ్వవిద్యాలయాలు బీటెక్‌ చదివినవారికి కూడా దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చదవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అలాంటి విశ్వవిద్యాలయాల్లో మీరు ప్రస్తుతం చదువుతున్న బీఎస్సీని కొనసాగిస్తూనే, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ కూడా చదివే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని