డ్రోన్స్‌ కోర్సు ఎక్కడ?

బీటెక్‌ చదివాను. డ్రోన్స్‌ టెక్నాలజీపై ఆసక్తి ఉంది. సంబంధిత కోర్సు ఎక్కడ ఉందో చెప్పగలరు.

Published : 06 Jun 2022 00:38 IST

బీటెక్‌ చదివాను. డ్రోన్స్‌ టెక్నాలజీపై ఆసక్తి ఉంది. సంబంధిత కోర్సు ఎక్కడ ఉందో చెప్పగలరు.

- ఎన్‌. భవాని

ఇటీవలికాలంలో డ్రోన్‌ల వినియోగం చాలా రంగాల్లో పెరుగుతోంది. సాధారణంగా డ్రోన్‌లకు సంబంధించి మూడు రకాల కెరియర్‌లుంటాయి. మొదటిది డ్రోన్‌లను తయారు చేయడం, రెండోది డ్రోన్‌ల సర్వీస్‌, మూడోది డ్రోన్‌లను ఆపరేట్‌ చేయడం. ఇందులో మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. డ్రోన్‌ల తయారీ/ ఆపరేట్‌ చేయడంలో అనుభవం పెరిగేకొద్దీ నైపుణ్యం పెరుగుతుంది. వీటికి సంబంధించి ప్రత్యేకమైన డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో లేవు. డ్రోన్‌ల గురించి అవగాహన/ శిక్షణ కోసం వివిధ రకాల సంస్థలు ఉన్నాయి. డీజీసీఏ అనుమతి ఉన్న సంస్థల్లో మాత్రమే శిక్షణ పొందండి. తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడెమీతో పాటు, వివిధ ప్రైవేటు సంస్థలు కూడా డ్రోన్లకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఏదైనా శిక్షణ సంస్థను ఎంపిక చేసుకొనేముందు దాని విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని