ఏ విభాగంలో ఎంఎస్‌ మెరుగు?

ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాను.

Published : 15 Nov 2022 00:26 IST

ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాను. ఏ విభాగంలో ఎంఎస్‌ చేస్తే మెరుగైన ఉద్యోగావకాశాలుంటాయి?

- బిందు

మీరు కంప్యూటర్‌ సైన్స్‌లో కానీ, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో కానీ, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌లో కానీ ఎంఎస్‌ చేయవచ్చు. ఇవే కాకుండా, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి లాజిస్టిక్స్‌, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి వాటి గురించీ ఆలోచించవచ్చు. ఇటీవలికాలంలో డేటా సైన్స్‌ చదివినవారికి ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. అందుకని ఆసక్తి ఉంటే డేటా సైన్స్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లో ఎంఎస్‌ చేసే ప్రయత్నం చేయండి. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫిన్‌ టెక్‌, ఐఓటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ లాంటి కోర్సుల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని