లిటరేచర్‌తో ఏ డిగ్రీ మేలు?

ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాను. నాకు లిటరేచర్‌ అంటే చాలా ఇష్టం. సృజనాత్మకంగానూ ఆలోచిస్తాను.

Published : 05 Dec 2022 00:22 IST

ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాను. నాకు లిటరేచర్‌ అంటే చాలా ఇష్టం. సృజనాత్మకంగానూ ఆలోచిస్తాను. నా ఆసక్తికి అనుగుణంగా ఏ డిగ్రీని ఎంచుకోవాలో సూచించగలరు.

- రిషిత

* మీకు ఏ లిటరేచర్‌ అంటే ఇష్టమో చెప్పలేదు. మీకు తెలుగు/ హిందీ లిటరేచర్‌లో ఆసక్తి ఉంటే బీఏ డిగ్రీలో తెలుగు/ హిందీ లిటరేచర్‌ని కానీ, బీఏలో తెలుగు/ హిందీని ఒక మెయిన్‌ ఆప్షనల్‌గా కానీ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంగ్ల్లిష్‌ లిటరేచర్‌పై ఆసక్తి ఉంటే బీఏ ఇంగ్లిష్‌ ఆనర్స్‌ కోర్సు కానీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సును కానీ ఎంచుకోండి. బీఏ లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులో కూడా ఇంగ్లిష్‌ ఒక మెయిన్‌ కోర్సుగా అందుబాటులో ఉంది. అదేవిధంగా బీఏలో ఇంగ్లిష్‌తో పాటు జర్నలిజం/ సైకాలజీ/ ఎకనామిక్స్‌ లాంటి కోర్సులను కూడా చదివే అవకాశం ఉంది. మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక అభిరుచి, ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మీకు తగిన కోర్సును ఎంచుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని