సగటు విద్యార్థి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలంటే?

మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించాలంటే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకొని, పట్టు సాధించాలి.

Updated : 03 Jan 2023 05:03 IST

డిగ్రీ చదివాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలనుంది. సగటు జీపీఏ సాధించే విద్యార్థి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలంటే ఎలా ప్రయత్నించాలి?

సీహెచ్‌. రవితేజ

* మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించాలంటే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకొని, పట్టు సాధించాలి. మీరు డిగ్రీలో చదివిన సబ్జెక్టులపైనే ఆధారపడితే నేరుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందడం కష్టం. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి బాగా డిమాండ్‌ ఉన్న ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కోర్సులను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. కనీసం ఏడాది పాటు సీ, జావా, ఆర్‌, పైతాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌తో పాటు, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, డేటా స్ట్రక్చర్స్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ లాంటి సబ్జెక్టులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా నేర్చుకోండి. మీకు డిగ్రీలో మార్కుల శాతం ఎక్కువగా లేకపోతే కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌ల్లో పీజీ చేసి మంచి మార్కులు పొందటం మేలు. పీజీ కోర్సును క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశాలున్న విద్యా సంస్థల్లో చదివితే మంచిది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్‌, లాంగ్వేజ్‌, ఎనలిటికల్‌, లాజికల్‌ స్కిల్స్‌ చాలా అవసరం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని