ఐఐటీలో పీహెచ్‌డీ చేయాలంటే?
కేరళలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ లింగ్విస్టిక్స్ చేస్తున్నాను. ఐఐటీ మద్రాస్, ముంబయి, కాన్పూర్, దిల్లీ లాంటి ఇన్‌స్టిట్యూట్లలో పీహెచ్‌డీ లింగ్విస్టిక్స్ చేయాలంటే ఏ పరీక్ష రాయాలి?
కేరళలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ లింగ్విస్టిక్స్ చేస్తున్నాను. ఐఐటీ మద్రాస్, ముంబయి, కాన్పూర్, దిల్లీ లాంటి ఇన్‌స్టిట్యూట్లలో పీహెచ్‌డీ లింగ్విస్టిక్స్ చేయాలంటే ఏ పరీక్ష రాయాలి? ఏ అర్హతలుండాలి?
వి. రమేష్
సాధారణంగా ఐఐటిల్లో పీహెచ్‌డీ చేయాలంటే పీజీలో 55% మార్కులు పొందివుండాలి. ఐఐటీ దిల్లీ మాత్రం 60% మార్కులను కనీస అర్హతగా నిర్ణయించింది. అన్ని ఐఐటీల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్/ ట్రైబ్ రిజర్వేషన్ కేటగిరీలకు చెందినవారికి పీజీ మార్కుల్లో 5% వెసులుబాటు ఉంది. ఐఐటీల్లో పీహెచ్‌డీకి పీజీతో పాటు గేట్/ జేెఆర్‌ఎఫ్/ నెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. గేట్, జేెఆర్‌ఎఫ్‌లు ఉన్నవారికి అడ్మిషన్లో ప్రాధాన్యం ఉంటుంది. మీకు పీజీ పరీక్షలో వచ్చిన మార్కుల శాతం, మీ పరిశోధనాంశం, గేట్ స్కోర్/ జేెఆర్‌ఎఫ్/నెట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలిచి, దానిలో సాధించిన మార్కుల ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తారు. పీజీలో పొందిన మార్కులు, మెడల్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, పరిశోధనానుభవం, పరిశోధన పట్ల మీకున్న ఆసక్తి..ఇవి మీ ప్రవేశాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఏవైనా పరిశోధన పత్రాలు ప్రామాణికమైన జర్నల్స్‌లో ప్రచురించినా, ప్రముఖ కాన్ఫరెన్స్‌ల్లో పరిశోధన పత్రాల్ని సమర్పించినా, మీకు పీహెచ్‌డీ ప్రవేశ అవకాశాలు మెరుగవుతాయి. ఐఐటీల్లో కొన్ని డిపార్ట్‌మెంట్‌లు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గేట్/ జేెఆర్‌ఎఫ్/ నెట్ లేనివారికి పీహెచ్‌డీలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష కూడా నిర్వహిస్తున్నాయి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Odisha train accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ