బీడీఎస్‌ తర్వాత..

బీడీఎస్‌ చదువుతున్నాను. తర్వాత ఉన్నత విద్య కోసం యూఎస్‌ యూనివర్సిటీకి వెళ్లాలని ఉంది. అక్కడి యూనివర్సిటీలు, స్కాలర్‌షిప్‌ వివరాలు తెలుపగలరు.

Updated : 29 Mar 2023 00:40 IST

బీడీఎస్‌ చదువుతున్నాను. తర్వాత ఉన్నత విద్య కోసం యూఎస్‌ యూనివర్సిటీకి వెళ్లాలని ఉంది. అక్కడి యూనివర్సిటీలు, స్కాలర్‌షిప్‌ వివరాలు తెలుపగలరు.

కావ్య

బీడీఎస్‌ తర్వాత యూఎస్‌లో పీజీ చేయాలంటే యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగన్‌, వాషింగ్టన్‌, బోస్టన్‌ యూనివర్సిటీ, టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌, నార్త్‌ కరోలినా, హార్వర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, బహాయో స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ అలబామాల్లో అవకాశం ఉంది. ఇక స్కాలర్‌షిప్‌ విషయానికి వస్తే.. ఏడీఈఏ/ క్రెస్ట్‌ ఓరల్‌ బి స్కాలర్‌షిప్‌ ఫర్‌ డెంటల్‌, డెంటల్‌ ట్రేడ్‌ అలయన్స్‌ ఫౌండేషన్‌, ఏడీఈఏ/గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ కన్‌స్యూమర్‌ హెల్త్‌ కేర్‌ డెంటిస్ట్రీ స్కాలర్‌షిప్‌, ఏడీఈఏ ఫౌండేషన్‌ డెంటల్‌ స్టూడెంట్‌ స్కాలర్‌షిప్‌, బారిగోల్డ్‌ వాటర్‌, క్రాక్‌డాట్‌ ప్రి డెంటల్‌ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్‌,  కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని