ఇస్లామిక్ స్టడీస్ చదివితే?
ఇస్లామిక్ స్టడీస్‌లో బి.ఎ. కోర్సు ఏ యూనివర్సిటీల్లో ఉంది? దీంతో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
ఇస్లామిక్ స్టడీస్‌లో బి.ఎ. కోర్సు ఏ యూనివర్సిటీల్లో ఉంది? దీంతో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? స్కాలర్‌షిప్ సౌకర్యం ఉంటుందా? - అబ్దుల్ హమీద్
* ఇస్లామిక్ స్టడీస్‌లో బి.ఎ. కోర్సు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అలీఘర్, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దిల్లీ, జామియా హందర్డ్ యూనివర్సిటీ దిల్లీ, అలియా యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ కాలేజ్ - కోల్‌కతా, బీఎస్ అబ్దుర్ రహమాన్ క్రెసెంట్ యూనివర్సిటీ చెన్నైల్లో అందుబాటులో ఉంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (హైదరాబాద్) ఇస్లామిక్ స్టడీస్‌లో బి.ఎ. కోర్సును దూరవిద్యలో అందిస్తోంది. బి.ఎ. ఇస్లామిక్ స్టడీస్ తరువాత ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ చదివే అవకాశం ఉంది. ఎంబీఏ ఇస్లామిక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా చదవొచ్చు. ఇవే కాకుండా- బి.ఎ. డిగ్రీ అర్హతతో చదివే పీజీ కోర్సులన్నిటికీ అర్హులవుతారు.
బి.ఎ. తరువాత బీఈడీ చేసి ఉపాధ్యాయులుగా, ఎంఏతో కళాశాలలో అధ్యాపకులుగా, పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా స్థిరపడవచ్చు. డిగ్రీ తరువాత జర్నలిజం చేసి జర్నలిస్టులుగా చేరవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు అనువాదకులుగానూ పనిచేయవచ్చు. కేంద్రప్రభుత్వ మైనారిటీస్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ‘మోమా’ స్కాలర్‌షిప్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, వివిధ యూనివర్సిటీలు అందించే మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?