విదేశీ స్కాలర్‌షిప్‌లున్నాయా?

ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ ఐదో ఏడాది చదువుతున్నాను. మూడేళ్లుగా ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతున్నాయి. కొవిడ్‌తో, యుద్ధంతో జీవితం దుర్భరమైపోయింది.

Published : 30 May 2023 00:52 IST

ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ ఐదో ఏడాది చదువుతున్నాను. మూడేళ్లుగా ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతున్నాయి. కొవిడ్‌తో, యుద్ధంతో జీవితం దుర్భరమైపోయింది. ఇక్కడి భారతీయ విద్యార్థులకు ఏమైనా స్కాలర్‌షిప్‌లూ, ఆర్థిక ప్రోత్సాహకాలూ లభిస్తాయా?

వినోద్‌

యుద్ధం వల్ల మీ పరిస్థితులు తలకిందులవ్వడం దురదృష్టకరం. ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన స్కాలర్‌షిప్‌లు అందుబాటులో లేవు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన భారతీయ విద్యార్థులకు ఇచ్చే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల కోసం ప్రయత్నించండి. ఇప్పటికే మీరు మెడిసిన్‌ ఐదో సంవత్సరంలో ఉన్నారు కాబట్టి స్కాలర్‌షిప్‌ పొందడానికి అవకాశం ఉండకపోవచ్చు. సాధారణంగా ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను విద్యార్థి ప్రతిభ, సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో పాటు ప్రవేశం పొందిన యూనివర్సిటీ అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల ఆధారంగా కేటాయిస్తారు. మీరు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఛారిటబుల్‌ ట్రస్ట్‌లను, విదేశాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే దాతలను సంప్రదించి ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు