ఇప్పుడు సాధ్యమేనా...

ఇంజినీరింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఐదేళ్లు ఎంఎన్‌సీల్లో పనిచేశాను. ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఏడేళ్లు ఎన్జీవోలో వాలంటీర్‌గా చేశాను.

Published : 06 Jul 2023 00:34 IST


* ఇంజినీరింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఐదేళ్లు ఎంఎన్‌సీల్లో పనిచేశాను. ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఏడేళ్లు ఎన్జీవోలో వాలంటీర్‌గా చేశాను. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో.. విదేశాల్లో ప్రోగ్రామ్‌ కోర్సు చేయాలనుంది. ఈ నిర్ణయం సరైనదేనా?
రమ్యకృష్ణ

నచ్చింది చదవడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. కానీ, విదేశీ విద్య విషయానికి వచ్చేసరికి వీసా నిబంధనలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ముందుగా.. మీరు ఏ దేశంలో ఉన్నత విద్యను చదవాలని అనుకుంటున్నారో.. ఆ దేశ వీసా నిబంధనలను తెలుసుకోండి. సాధారణంగా అమెరికా, కెనడా లాంటి దేశాల్లో 30 సంవత్సరాలు దాటిన వారికి స్టూడెంట్‌ వీసా, స్కాలర్‌షిప్‌ పొందడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ చదువుకి అయ్యే మొత్తం ఖర్చు మీరే భరిస్తే ప్రోగ్రామింగ్‌ కోర్సు చేసే అవకాశం ఉంది. మీ విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటే మీరు స్టూడెంట్‌గా కాకుండా స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేథమెటిక్స్‌) ప్రొఫెషనల్‌ కేటగిరీలో నేరుగా పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసా కోసం ప్రయత్నం చేసుకుని.. అక్కడ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఈ వయసులో ఈ నిర్ణయం సరైనదేనా, కాదా అనేది మీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది. ఈ నిర్ణయం మీతోపాటు మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తుని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అందరితో చర్చించి.. లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని