విదేశాల్లో జర్నలిజం కోర్సు

జర్నలిజం కోర్సు విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఉంది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా...

Published : 22 Nov 2023 00:06 IST
జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీకి సంబంధించి విదేశాల్లోని ఉత్తమ కళాశాలల వివరాలు చెప్పండి. ఈ కోర్సుతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
మనోహర్‌బాబు
ర్నలిజం కోర్సు విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఉంది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌- ఆస్టిన్‌, నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ - మాడిసన్‌, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ఇవే కాకుండా- ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌, హాంకాంగ్‌ల్లో కూడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు జర్నలిజం కోర్సును అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల విషయానికొస్తే జర్నలిజం చదివినవారు జర్నలిస్ట్‌, కంటెంట్‌ క్రియేటర్‌, రేడియో జాకీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్‌, కాలమిస్ట్‌, ఎడిటర్‌, క్రిటిక్‌, కాపీ రైటర్‌, ఫిల్మ్‌ మేకర్‌..ఇలాంటి హోదాల్లో ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. ఇవే కాకుండా బోధన, అడ్వర్‌టైజింగ్‌, బ్రాడ్‌ కాస్టింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ రంగాల్లోనూ వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని