ఆ ఎంఈడీ చెల్లుబాటవుతుందా?

బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎంఈడీని దూరవిద్యలో చేస్తే చెల్లుబాటవుతుందా?

Updated : 29 Jan 2024 04:51 IST

  • బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎంఈడీని దూరవిద్యలో చేస్తే చెల్లుబాటవుతుందా? ఏ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి?

శివకుమార్‌

  • సాధారణంగా బీఈడీ ప్రోగ్రాం వ్యవధి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మీరు బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నానన్నారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌/ బీఏఎడ్‌ ప్రోగ్రాం చదువుతున్నారని అనుకుంటున్నాం. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఎంఈడీ కోర్సును దూరవిద్యా విధానంలో అందించకూడదు. ఒకవేళ ఎవరైనా, అలా అందించే ప్రయత్నం చేస్తే ఆ ప్రోగ్రాంకు ఎన్‌సీటీఈ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి. మీకు టీచర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లో బోధించే ఆసక్తి ఉంటే, ఎంఈడీకి సమానమైన ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివే ప్రయత్నం చేయండి. ఇగ్నో సంస్థలో ఎంఏ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా.. రెగ్యులర్‌గా చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని