ఎంసీఏలో చేరే వీలుంటుందా?

బీఏ/బీకాం చదివి.. ఎంసీఏ చేయడానికి అవకాశం ఉంటుందా? నూతన విద్యా విధానం ప్రకారం ఇలా చేయొచ్చట కదా?

Updated : 21 Feb 2024 18:39 IST

బీఏ/బీకాం చదివి.. ఎంసీఏ చేయడానికి అవకాశం ఉంటుందా? నూతన విద్యా విధానం ప్రకారం ఇలా చేయొచ్చట కదా?    

- శ్రీనివాస్‌  

 ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రం ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా ఎంసీఏలో చేరవచ్చు. కానీ అలాంటి విద్యార్థులు ఎంసీఏ మొదటి సంవత్సరం సబ్జెక్టులతో పాటు, మ్యాథమెటిక్స్‌ను బ్రిడ్జ్‌ కోర్సుగా చదివి ఉత్తీర్ణత సాధించాలి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎంసీఏ ప్రోగ్రాం విద్యార్హతలను ఏఐసీటీఈ ఇంకా ప్రకటించలేదు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో   అమల్లోకి వస్తే ఏ డిగ్రీ చదివినవారైనా, ఏ పీజీ ప్రోగ్రాంలో అయినా ప్రవేశం పొందే వీలుంటుంది. కానీ, అంతకంటే ముందు ఇంటర్మీడియట్‌, డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్‌/ డిగ్రీలో మ్యాథ్స్‌ చదవనివారు ఎంసీఏ చదవడానికి అవకాశం ఉందో, లేదో తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం ఐసెట్‌/ నిమ్‌సెట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్‌, టెక్నికల్‌ కోర్సులకు మ్యాథ్స్‌లో ప్రావీణ్యం చాలా అవసరం. కాబట్టి గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి.. నైపుణ్యాలు పెంచుకోండి.  

 - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని