వ్యాయామం ఏదైనా..

ఏ వయసులోనైనా తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఆరోగ్యానికి చాలా కీలకం. వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి వ్యాయామం చేయాలని ప్రస్తుత మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

Published : 31 Jan 2023 01:05 IST

ఏ వయసులోనైనా తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఆరోగ్యానికి చాలా కీలకం. వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి వ్యాయామం చేయాలని ప్రస్తుత మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. కానీ ఎలాంటి రకం వ్యాయామాలు చేయాలి? వీటిని గుర్తించటానికే పరిశోధకులు ఇటీవల వయసు మీరిన వారిపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. నడక, పరుగు, ఈత, రాకెట్‌తో ఆడే టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటి ఆటలు.. గోల్ఫ్‌, సైకిల్‌ తొక్కటం వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు చేసేవారి ఆరోగ్య వివరాలను పరిశీలించారు. మొత్తం 12 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో వ్యాయామ రకాలు, తీవ్రత ప్రభావాలను అంచనా వేశారు. అసలే వ్యాయామం చేయనివారితో పోలిస్తే సిఫారసు చేసిన మేరకు వ్యాయామం చేసినవారికి మరణం ముప్పు 13% తక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. అన్నిరకాల వ్యాయామాలు మంచి ప్రభావమే చూపిస్తున్నప్పటికీ రాకెట్‌తో ఆడే ఆటలు లేదా పరుగుతో మరింత ఎక్కువగా ప్రయోజనం కలుగుతుండటం విశేషం. వ్యాయామం చేయనివారు దీన్ని గుర్తించాలని.. ఇప్పటికైనా ఏదో ఒక వ్యాయామాన్ని ఎంచుకొని ఆరంభించటం, క్రమం తప్పకుండా చేయటం ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని