మధుమేహానికి ‘పొడవు’ రక్ష!

పొడవుగా ఉన్నారా?పొట్టిగా ఉన్నారా? ఇప్పుడెందుకు ఇవన్నీ అనుకుంటున్నారా? పొడవుగా ఉండేవారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారికి ...

Published : 29 Oct 2019 00:17 IST

పొడవుగా ఉన్నారా?పొట్టిగా ఉన్నారా? ఇప్పుడెందుకు ఇవన్నీ అనుకుంటున్నారా? పొడవుగా ఉండేవారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారికి మధుమేహం (డయాబెటీస్‌) ముప్పు ఎక్కువని జర్మనీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఎత్తు తగ్గినకొద్దీ ముప్పూ పెరుగుతుండటం గమనార్హం. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే 33% మేరకు పెరుగుతూ వస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణమేంటో తెలుసా? ఎత్తు తక్కువగా ఉండేవారి కాలేయంలో కొవ్వు స్థాయులు ఎక్కువగా ఉండటం. గుండెజబ్బులు, ఇతరత్రా జీవక్రియ సంబంధ జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియలు సైతం ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. ఇవన్నీ మధుమేహాన్ని తెచ్చిపెట్టేవే. అందుకే కాలేయ కొవ్వును తగ్గించే పద్ధతులతో మధుమేహం ముప్పును తగ్గించుకునే అవకాశం లేకపోలేదని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని