ఆయుష్షు మన చేతుల్లో

మన ఆయుష్షు చాలావరకు తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి సంక్రమించిన జన్యువుల మీదే ఆధారపడి ఉంటుందని నమ్ముతూ వస్తున్నాం. ఇందులో అంత నిజం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Published : 17 Dec 2019 01:17 IST

న ఆయుష్షు చాలావరకు తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి సంక్రమించిన జన్యువుల మీదే ఆధారపడి ఉంటుందని నమ్ముతూ వస్తున్నాం. ఇందులో అంత నిజం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయుష్షులో జన్యువుల పాత్ర 20-30% వరకు ఉంటుందని ఇప్పటివరకూ భావిస్తుండగా.. అది 7% కన్నా తక్కువగానే ఉంటోందని వివరిస్తున్నారు. తోడబుట్టినవారితో  పోలిస్తే జీవిత భాగస్వాములు, అత్త, మామల జీవనకాలం దాదాపు సమానంగానే ఉంటున్నట్టు తేలటమే దీనికి కారణం. అంటే మన ఆయుష్షును స్వచ్ఛమైన నీరు తాగటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, పొగ అలవాటుకు దూరంగా ఉండటం వంటి జీవనశైలి అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టు ఇది గట్టిగా సూచిస్తోందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని