దంత ఇంప్లాంట్స్‌తో కళ్లకు ఇబ్బందా?

సమస్య: నాకు 30 ఏళ్లు. ఆరు నెలల క్రితం నాకు ముందు రెండు దంతాలు ఊడిపోయాయి. డెంటల్‌ ఇంప్లాంట్స్‌ గురించి విన్నాను. వీటిని అమర్చుకుంటే దుష్ప్రభావాలేవైనా ఉంటాయా? కళ్లపై ఇవి ప్రభావం చూపుతాయా?

Published : 08 Jun 2021 01:04 IST

సమస్య: నాకు 30 ఏళ్లు. ఆరు నెలల క్రితం నాకు ముందు రెండు దంతాలు ఊడిపోయాయి. డెంటల్‌ ఇంప్లాంట్స్‌ గురించి విన్నాను. వీటిని అమర్చుకుంటే దుష్ప్రభావాలేవైనా ఉంటాయా? కళ్లపై ఇవి ప్రభావం చూపుతాయా?

- జి.బాలరాజు, విశాఖపట్నం

సలహా: మీరు దంతాలు ఊడిపోయాయని రాశారు గానీ ఎలా ఊడాయన్నది తెలియజేయలేదు. ఏదైనా ప్రమాదం జరగటంతో ఊడాయా? చిగుళ్లవాపు సమస్యతో ఊడాయా? అనేది చూడటం ముఖ్యం. ఏదేమైనా ఒకసారి దవడ ఎక్స్‌రే తీసి లేదా స్కాన్‌ చేసి పరిశీలించాల్సి ఉంటుంది. ఊడిపోయిన దంతాల మధ్య ఎముక ఎలా ఉంది? పక్క దంతాలు ఎలా ఉన్నాయి? అనేవి ఇందులో బయటపడతాయి. ఎముక బాగుంటే ఇంప్లాంట్స్‌ అమర్చుకోవచ్చు. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇప్పుడు ఇంప్లాంట్స్‌ అమర్చటం చాలా తేలికైన పద్ధతిగా మారింది. ఇందులో దవడ ఎముకకు రంధ్రం చేసి ఇంప్లాంట్‌ అమరుస్తారు. ఇది దంత మూలం మాదిరిగా పనిచేస్తుంది. దీనిపై క్రౌన్స్‌ బిగిస్తారు. ఇది అచ్చం దంతంలాగే కనిపిస్తుంది, పనిచేస్తుంది. మీరు 30 ఏళ్ల వయసులోనే దంతాలు ఊడిపోయాయని అంటున్నారు. ప్రమాదమేమీ జరగకుండా చిగుళ్లవాపుతో దంతాలు ఊడినట్టయితే మధుమేహం వంటి సమస్యలేవైనా ఉన్నాయేమో చూసుకొని తగు చికిత్స తీసుకోవటం మంచిది. దీంతో మున్ముందు చిగుళ్లవాపు తలెత్తకుండా నివారించుకోవచ్చు.
 

-డా।। కడియాల రాజేంద్ర, సీనియర్‌ డెంటిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని