అలసత్వం వద్దు

కొవిడ్‌-19 విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. కేసులు తగ్గాయని అలసత్వం తగదు. రోజురోజుకీ కొత్త సార్స్‌-కొవీ-2 రకాలు పుట్టుకొస్తున్నాయనే విషయాన్ని మరవరాదు. వైరస్‌ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వస్తోంది. కొత్త జవసత్వాలతో విరుచుకు పడటానికి ప్రయత్నిస్తోంది.

Published : 20 Jul 2021 02:12 IST

కొవిడ్‌-19 విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. కేసులు తగ్గాయని అలసత్వం తగదు. రోజురోజుకీ కొత్త సార్స్‌-కొవీ-2 రకాలు పుట్టుకొస్తున్నాయనే విషయాన్ని మరవరాదు. వైరస్‌ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వస్తోంది. కొత్త జవసత్వాలతో విరుచుకు పడటానికి ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు డెల్టా రకం వైరస్‌నే చూడండి. దీన్ని బి.1.617.2 అనీ పిలుచుకుంటున్నారు. కణాల్లోకి తేలికగా చొచ్చుకొళ్లేలా ఇది ముల్లు ప్రొటీన్‌ను మార్చేసుకుంది. దీంతో త్వరగా ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తుంది. దీని బారినపడ్డవారి నుంచి ఇతరులకు వేగంగానూ వ్యాపిస్తోంది. అల్ఫా రకం వైరస్‌ కన్నా డెల్టా రకం వైరస్‌ 50% ఎక్కువ వేగంగా వ్యాపిస్తుండటం గమనార్హం. డెల్టా బారినపడ్డ ఒకొకరు సగటున ముగ్గురు లేదా నలుగురికి వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది టీకాల ప్రభావాన్ని సైతం తప్పించుకొంటుండటం ఆందోళనకరం. డెల్టా నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్‌ రకం వైరస్‌ అయితే ఊపిరితిత్తుల కణాల మీద ఇంకాస్త ఎక్కువగానూ దాడి చేస్తోంది. ఇదీ టీకాల ప్రభావాన్ని తప్పించుకుంటోంది. కాబట్టి కరోనా పూర్తిగా కనుమరుగయ్యేంతవరకు మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని