కీళ్లకు పీచు బలం!

మోకీళ్ల నొప్పుల బారినపడకుండా చూసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో తగినంత పీచు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తగినంత పీచు తీసుకునే వృద్ధులకు మోకీళ్ల నొప్పుల ముప్పు 30% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Published : 08 Jan 2019 00:36 IST

మోకీళ్ల నొప్పుల బారినపడకుండా చూసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో తగినంత పీచు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తగినంత పీచు తీసుకునే వృద్ధులకు మోకీళ్ల నొప్పుల ముప్పు 30% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పీచుతో బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. ఇది ఒంట్లో వాపు ప్రక్రియ తగ్గుముఖం పట్టటానికి తోడ్పడుతుంది. ఇవన్నీ కీళ్లనొప్పులను తగ్గించేవే మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని