మరింత పొగ

ఒకవైపు ఊపిరితిత్తుల మీద దాడిచేసే కరోనా. మరోవైపు ఊపిరితిత్తులను దెబ్బతీసే పొగ అలవాటు....

Published : 19 May 2020 00:15 IST

కవైపు ఊపిరితిత్తుల మీద దాడిచేసే కరోనా. మరోవైపు ఊపిరితిత్తులను దెబ్బతీసే పొగ అలవాటు. కరోనా జబ్బు ముప్పు, తీవ్రత పెరగకుండా ఉంటాయా? పరిశోధనలూ ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. కొవిడ్‌-19కు చికిత్స తీసుకుంటున్నవారిలో- పొగ అలవాటు లేనివారిలో 17.6% మందికి కరోనా తీవ్రంగా పరిణమిస్తుండగా.. పొగ తాగేవారిలో 29.8% మంది అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకోవటం గమనార్హం. పొగ అలవాటు కొనసాగిస్తున్నవారిలోనే కాదు, గతంలో పొగ అలవాటు గలవారికీ ఇలాంటి ముప్పు పొంచి ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివైనా ఇ-సిగరెట్లయినా శ్వాస మార్గాలను దెబ్బతీసేవే. రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని తగ్గించేవే. అందుకే పొగ అలవాటు గలవారికి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కాబట్టే కొవిడ్‌-19 పోరాటంలో పొగ అలవాటును మానెయ్యటాన్నీ చేర్చాలని పరిశోధకులు గట్టిగా సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని