తల్లి గర్భవాతం పిల్లలకు చేటు

కొందరు గర్భిణుల్లో నెలలు నిండే ముందు రక్తపోటు పెరుగుతుంది. మూత్రంలో సుద్ద కూడా పోతుంటుంది. దీన్నే గర్భవాతం (ప్రి-ఎక్లాంప్సియా) అంటారు.

Published : 07 Mar 2023 00:25 IST

కొందరు గర్భిణుల్లో నెలలు నిండే ముందు రక్తపోటు పెరుగుతుంది. మూత్రంలో సుద్ద కూడా పోతుంటుంది. దీన్నే గర్భవాతం (ప్రి-ఎక్లాంప్సియా) అంటారు. తల్లి కడపులో ఉండగా దీని ప్రభావానికి గురైన పిల్లలకు యుక్త వయసులో పక్షవాతం, గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. ఇలాంటి పిల్లల్లో రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వీడన్‌లోని కరోలీనా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు సుమారు 85 లక్షల మంది పిల్లల వివరాలను పరిశీలించారు. వీరిలో మొత్తమ్మీద చూస్తే గుండెజబ్బులు, పక్షవాతం చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే గర్భవాత ప్రభావానికి గురైన పిల్లలకు 19 ఏళ్లు వచ్చేసరికి గుండెజబ్బు ముప్పు 33%, పక్షవాతం ముప్పు 34% వరకు పెరుగుతున్నట్టు బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని