నొప్పి మందులతోనే నొప్పి!
కొన్నిసార్లు ఉన్నట్టుండి, హఠాత్తుగా నొప్పులు తలెత్తుతుంటాయి. కొందరికివి కొద్ది నెలలు, వారాల తర్వాత తగ్గిపోతాయి. మరికొందరికి విడవకుండా దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటాయి. దీనికి కారణమేంటన్నది ఇంకా పూర్తిగా తెలియదు. తొలిదశలో
కొన్నిసార్లు ఉన్నట్టుండి, హఠాత్తుగా నొప్పులు తలెత్తుతుంటాయి. కొందరికివి కొద్ది నెలలు, వారాల తర్వాత తగ్గిపోతాయి. మరికొందరికి విడవకుండా దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటాయి. దీనికి కారణమేంటన్నది ఇంకా పూర్తిగా తెలియదు. తొలిదశలో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రతిస్పందన ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. నడుంనొప్పి బారిన పడ్డవారిలో మొదట్లో వాపుప్రక్రియ ఒక మాదిరిగా ఉన్నవారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నవారిలో మూడు నెలల తర్వాత నొప్పి తగ్గే అవకాశం అధికంగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరిలో వేలాది జన్యువులు.. ముఖ్యంగా వాపుప్రక్రియ ప్రతిస్పందన, రోగనిరోధక కణాల ప్రేరేణతో ముడిపడిన జన్యువుల వ్యక్తీకరణ మారినట్టూ కనుగొన్నారు. నొప్పి విడవకుండా కొనసాగినవారిలో ఇలాంటి మార్పేమీ కనిపించలేదు. ఈ మార్పుల ఆధారంగా నొప్పి ఎవరికి దీర్ఘకాల సమస్యగా మారొచ్చనేది గుర్తించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. నొప్పి తలెత్తిన మొదట్లో మందులతో వాపుప్రక్రియ ప్రతిస్పందనను ఆపితే దీర్ఘకాల సమస్యగా మారుతున్నట్టూ తేలటం గమనార్హం. అంటే నొప్పి మందులు, స్టిరాయిడ్లతో అప్పటికి బాధ తగ్గుతుండొచ్చు గానీ మున్ముందు దీర్ఘకాల సమస్యగా మారే అవకాశం ఉంటోందన్నమాట. కాబట్టి నొప్పి నివారణ మందుల వాడకంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర
-
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
-
Telangana Elections: చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం
-
Hyderabad: వారికి మస్త్ మెజారిటీ.. వీరికి బొటాబొటీ
-
Janasena: డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు
-
Telangana Election Results: అప్పుడలా.. ఇప్పుడిలా..!