వ్యాయామం కాస్త మానేసినా..
ఆరోగ్యంగానే ఉన్నాం కదా. ఎలాంటి సమస్యలు లేవు కదా. కొద్దిరోజులు వ్యాయామం మానేస్తే ఏం? కొంపలేమైనా మునిగిపోతాయా? మనలో చాలామంది ఇలాగే అనుకుంటుంటారు. అప్పుడప్పుడు వ్యాయామం ఆపేసినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావిస్తుంటారు. కానీ ఇదేమంత మంచి పద్ధతి కాదు. కేవలం 2 వారాల పాటు వ్యాయామం మానేసినా కండరాల మోతాదు తగ్గుతోందని, కొవ్వు శాతం పెరిగిపోతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దీని మూలంగా మధుమేహం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పూ ఎక్కువవుతోందని చెబుతున్నాయి. ఇంత తక్కువకాలంలోనే ఇలాంటి ప్రభావం కనబడటమనేది ఆశ్చర్యకరమైన విషయమని.. మన సమాజంలో ఊబకాయం, మధుమేహం వంటివి ఎందుకు పెరుగుతున్నాయో అనే సంగతిని ఇది చెప్పకనే చెబుతోందని పరిశోధకులు అంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయటానికి తగినంత సమయం లభించకపోతే ఇంట్లో, ఆఫీసుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని వివరిస్తున్నారు. రోజుకి కనీసం 5000 అడుగులు.. సెలవుదినాల్లో 10,000 అడుగులు నడిచేలా చూసుకోవటం మంచిది. ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరాలు ధరిస్తే ఎంత చురుకుగా ఉన్నామో తేలికగా తెలుసుకోవచ్చు. ఎక్కువసేపు కూచొని పనులు చేసేవారు వీలైనప్పుడల్లా కుర్చీలోంచి లేచి మూడు, నాలుగు నిమిషాల సేపు అటూఇటూ నడవటం మేలు. కావాలంటే వాహనాలను ఆఫీసు, దుకాణ సముదాయాలకు కాస్త దూరంలో నిలిపి నడిచి వెళ్లొచ్చు కూడా. సహోద్యోగులను కలవటానికి వెళ్లేటప్పుడు దూరం దారులను ఎంచుకోవచ్చు. అవసరమైతే తేలికగా కుర్చీలో కూచొని చేసే యోగా పద్ధతులనూ పాటించొచ్చు. ఇలా మనసుంటే మార్గం దొరక్కపోదు. బద్ధకాన్ని వీడి కాళ్లకు పనిచెప్పగలిగితే శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవటమే కాదు, పనుల్లోనూ మంచి ఫలితాలు సాధించొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు