స్టాటిన్స్‌తో పక్షవాతం దూరం!

పక్షవాతం తీవ్ర సమస్య. వైకల్యానికి, మరణానికి దారి తీస్తుంది. కొవ్వు, ఉప్పు పదార్థాలు తక్కువగా తినటం.. వ్యాయామం చేయటం, పొగ తాగకపోవటం వంటి మంచి జీవనశైలితో పక్షవాతం బారిన పడకుండా చూసుకోవచ్చు.

Updated : 20 Dec 2022 00:46 IST

క్షవాతం తీవ్ర సమస్య. వైకల్యానికి, మరణానికి దారి తీస్తుంది. కొవ్వు, ఉప్పు పదార్థాలు తక్కువగా తినటం.. వ్యాయామం చేయటం, పొగ తాగకపోవటం వంటి మంచి జీవనశైలితో పక్షవాతం బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇందుకు స్టాటిన్లు కూడా సమర్థమైన మార్గమని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ డెన్మార్క్‌ తాజా అధ్యయనం పేర్కొంటోంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఇవి ధమనుల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. ఇలా మెదడుకు రక్త సరఫరా నిలిచిపోకుండా కాపాడతాయి. గుండె జబ్బులు, పక్షవాతం నివారణకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీటిని వాడుతున్నారు కూడా. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టటంతోనే కాదు.. మెదడులో రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం కావటం మూలంగానూ పక్షవాతం సంభవిస్తుంది. ఇది చాలా తీవ్రమైంది. ప్రాణాంతకమైంది. ఇలాంటి రకం పక్షవాతం నివారణకూ స్టాటిన్లు ఉపయోగ పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎంత ఎక్కవ కాలంగా స్టాటిన్లు వాడుతుంటే అంత ఎక్కువగా పక్షవాతం ముప్పు తగ్గుతోందని వివరిస్తున్నారు. ఐదేళ్లుగా వీటిని వాడేవారికి పక్షవాతం ముప్పు 30 శాతం తక్కువగా ఉంటున్నట్టు తేలటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని