రెప్ప కురుపు తగ్గేలా..

కంట్లో చిన్న నలక పడితేనే తెగ బాధపడతాం. ఇక రెప్ప కురుపు ఏర్పడితే? కన్ను తెరవటమే కష్టం. లోపలేదో ముల్లు గుచ్చుకున్నట్టు నొప్పి, మంట పుడతాయి. కళ్లు ఎరుపెక్కుతాయి.

Published : 13 Jun 2023 01:23 IST


కంట్లో చిన్న నలక పడితేనే తెగ బాధపడతాం. ఇక రెప్ప కురుపు ఏర్పడితే? కన్ను తెరవటమే కష్టం. లోపలేదో ముల్లు గుచ్చుకున్నట్టు నొప్పి, మంట పుడతాయి. కళ్లు ఎరుపెక్కుతాయి. నీరూ కారుతుంది. రెప్ప కురుపు తలెత్తటానికి మూలం కళ్ల చివర తైలగ్రంథి ఇన్‌ఫెక్షన్‌. దీన్నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి.
* లవంగాన్ని నీటితో అరగదీసి కళ్ల మీద రాస్తే తక్షణం బాధ తగ్గుతుంది. ఖర్జూరం విత్తనాన్ని నీటితో అరగదీసి, రాసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
* కళ్లను సవ్య, అవసవ్య దిశలో గుండ్రంగా.. కుడి, ఎడమ పక్కలకు.. పైకీ, కిందికీ కదిలించటంతోనూ ఫలితం కనిపిస్తుంది. మెడ, భుజాలను గుండ్రంగా తిప్పటమూ మేలు చేస్తుంది.
* అరచేతులను కళ్ల మీద ఆనించి, కాసేపు అలాగే ఉంచినా ప్రయోజనం కనిపిస్తుంది. ఇది కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. కళ్లకు, చుట్టుపక్కల కణజాలానికి హాయిని కలిగిస్తుంది. అయితే చేతులతో కళ్లను గట్టిగా అదమకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని