ఆస్ప్రిన్‌ అందరికీ వద్దు!

గుండెజబ్బు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఆస్ప్రిన్‌ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. అప్పటికే గుండెజబ్బులు గలవారికి తప్ప ఆరోగ్యంగా ఉన్నవారికివి అంతగా ఉపయోగపడటం లేదని, లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.

Published : 09 Jun 2020 02:08 IST

గుండెజబ్బు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఆస్ప్రిన్‌ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. అప్పటికే గుండెజబ్బులు గలవారికి తప్ప ఆరోగ్యంగా ఉన్నవారికివి అంతగా ఉపయోగపడటం లేదని, లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. గుండెపోటు, పక్షవాతం బారినపడ్డవారికి.. బైపాస్‌ సర్జరీ చేయించుకున్నవారికి డాక్టర్లు ముందు జాగ్రత్తగా తక్కువ మోతాదులో (325 మి.గ్రా. కన్నా తక్కువ) ఆస్ప్రిన్‌ ఇస్తుంటారు. కానీ కొందరు ముందు జాగ్రత్తగా.. అదీ డాక్టర్‌ సలహా లేకుండా సొంతంగా కొనుక్కొని వీటిని వేసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదని బ్రిటన్‌, ఇటలీ పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. గుండెజబ్బులు లేనివారు వీటిని వేసుకుంటే గుండెపోటు ముప్పు 17% వరకు తగ్గుతున్నప్పటికీ.. పేగుల్లో రక్తస్రావం ముప్పు 47%, మెదడులో రక్తస్రావం ముప్పు 34% అధికంగా ఉంటున్నట్టు తేలటం గమనార్హం. అందువల్ల డాక్టర్‌ సలహా లేకుండా స్వల్ప మోతాదు ఆస్ప్రిన్‌ వేసుకోవటం తగదన్నది పరిశోధకుల సూచన. దీని కన్నా రక్తపోటు అదుపులో ఉంచుకోవటం, పొగ అలవాటు మానెయ్యటం, కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవటం మీద దృష్టి పెట్టటం మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు