శాక పాలలో పోషకాలు తక్కువే

బాదం పాలు. సోయా పాలు. ఓట్స్‌, బియ్యం పాలు. ఇలాంటి ప్రత్యామ్నాయ పాలు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. శాకాహారులు..

Published : 30 Aug 2022 01:08 IST

బాదం పాలు. సోయా పాలు. ఓట్స్‌, బియ్యం పాలు. ఇలాంటి ప్రత్యామ్నాయ పాలు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. శాకాహారులు.. అలాగే నైతిక, పర్యావరణ కారణాలతో పాల ఉత్పత్తులు వద్దనుకునేవారు వీటిని బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఆవు పాలతో పోలిస్తే ఇలాంటి ‘శాక’ పాలలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, జింక్‌, సెలీనియం అనే కీలక పోషకాలు తక్కువ మోతాదులో ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. వేరుసెనగ ప్రొటీన్‌తో చేసిన పాలు మాత్రం దీనికి మినహాయింపు. ఇందులో ఆవు పాలతో సమానంగానే ఈ పోషకాలు ఉంటున్నట్టు తేలింది. కణజాలం వృద్ధి చెందటానికి, మరమ్మతు కావటానికి ఫాస్ఫరస్‌ తోడ్పడుతుంది. విటమిన్‌ డి, అయోడిన్‌ వంటి పోషకాలను శరీరం ఉపయోగించు కోవటానికీ ఇది అవసరం. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి సెలీనియం తప్పనిసరి. కాబట్టి శాక పాలు వాడేవారు ఆహార పదార్థాల ద్వారా ఇలాంటి పోషకాలు లభించేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని