కంటికి మెట్‌ఫార్మిన్‌ రక్ష

ఒకటి కొంటే ఒకటి ఉచితమనే ప్రకటనలు చూస్తూనే ఉంటాం. మరి ఒక మందు వేసుకుంటే అదనంగా మరో జబ్బు నుంచీ కాపాడితే?

Published : 06 Feb 2024 00:24 IST

ఒకటి కొంటే ఒకటి ఉచితమనే ప్రకటనలు చూస్తూనే ఉంటాం. మరి ఒక మందు వేసుకుంటే అదనంగా మరో జబ్బు నుంచీ కాపాడితే? రక్తంలో గ్లూకోజు తగ్గటానికి వాడే మెట్‌ఫార్మిన్‌ మందు ఇలాంటి పనే చేస్తున్నట్టు రెటీనా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఇది వయసుతో ముడిపడిన మాక్యులర్‌ క్షీణత ముప్పు స్వల్పంగా తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తైవాన్‌ వాసుల ఆరోగ్య సమాచార విశ్లేషణలో వెల్లడైంది. వయసు మీద పడుతున్నకొద్దీ కొందరికి కంటి రెటీనా మధ్యభాగం (మాక్యులా) క్షీణిస్తుంటుంది. నెమ్మదిగా ముదురుతూ వచ్చే ఈ సమస్య చూపు తగ్గటానికీ దారితీస్తుంది. యాబై ఏళ్లు పైబడ్డవారిలో చూపు పోవటానికి దారితీస్తున్న వాటిల్లో ఇది ప్రధానమైంది. మెట్‌ఫార్మిన్‌ వాడే మధుమేహుల్లో మాక్యులా క్షీణత ముప్పు 8% వరకూ తగ్గుతున్నట్టు తేలటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని