నవ్వుల్‌.. నవ్వుల్‌..!

రమ్య : అమ్మా.. మనుషుల కంటే కంప్యూటర్లు అంత వేగంగా ఎలా పనిచేస్తాయి?

Published : 22 May 2022 01:19 IST

మాట వింటే సరి!

రమ్య : అమ్మా.. మనుషుల కంటే కంప్యూటర్లు అంత వేగంగా ఎలా పనిచేస్తాయి?

అమ్మ : ఎందుకంటే, అవి ‘మదర్‌’ బోర్డు చెప్పిన మాటలు వింటాయి కాబట్టి..

భలే బాధ్యత..

మావయ్య : బంటీ.. పుస్తకాలు అలా ఎక్కడపడితే అక్కడ పడేయకపోతే.. కాస్త బాధ్యతగా సర్దుకోవచ్చు కదా?

బంటి : నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు మావయ్యా.. నా అంత బాధ్యతాయుతమైన వారే లేరనీ మా స్కూల్‌లో అందరికీ తెలుసు..

మావయ్య :   ఎలా?

బంటి : మా క్లాసులో ఏ వస్తువు పోయినా, అల్లరి వినిపించినా.. అందరూ నన్నే బాధ్యుడిని చేస్తారు కాబట్టి..

మావయ్య : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని